కడప పట్టణ ఒకటో ఠాణా పరిధిలో మట్కా బీటర్లను గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక నాగేంద్రనగర్‌లోని కడప పబ్లిక్ పాఠశాల వద్ద మట్కా నిర్వహిస్తున్నట్లు సమాచారం రావటంతో సీఐ నాగరాజు సిబ్బందితో కలిసి దాడి చేశారు. మట్కా నిర్వాహకుడు టీచర్స్ కాలనీకి చెందిన విశనగిరి గురువిష్ణు, బీటర్లు జమ్మలమడుగు మండలం కన్నెలూరు గ్రామానికి చెందిన గంటల హుస్సేన్, ప్రొద్దుటూరు మండలం చౌటపల్లికి చెందిన మెరువ వెంకటేష్‌తో పాటు మట్కా ఆడుతున్న దియ్యా ప్రసాద్, మడక వెంకటరమణను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.1.02 లక్షల నగదు, మట్కా చీటీలు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు.
ప్రొద్దుటూరులో ఐదుగురు మట్కా బీటర్ల అరెస్టు - kadapa district latest news
ప్రొద్దుటూరు నాగేంద్రనగర్‌లోని కడప పబ్లిక్ పాఠశాల వద్ద మట్కా ఆడుతున్న ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి రూ.1.02 లక్షల నగదు, మట్కా స్లిప్పులు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ నాగరాజు తెలిపారు.
మట్కా ఆడుతున్న వారిని పట్టుకున్న ప్రొద్దుటూరు పోలీసులు