భర్తపై కోపంతో క్షణికావేశంలో వివాహిత బలవన్మరణానికి పాల్పడిన ఘటన కడప జిల్లా వీరపునాయునిపల్లె మండలంలో చోటు చేసుకుంది. చింతకుంట సునీత (27) అనే వివాహిత కుటుంబ కలహాల నేపథ్యంలో గాలేరు-నగరి కాలువలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. సొమవారం ఇంటి నుంచి వెళ్లిపోయిన ఆమె నీటి గుంతలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. తండ్రి ఫిర్యాదు మేరకు గంగిరెడ్డిపల్లె పోలీసు స్టేషన్ లో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మల్లికార్జున రెడ్డి తెలిపారు.
భర్తపై కోపంతో వివాహిత ఆత్మహత్య - married woman suicide at kadapa district news
కడప జిల్లా వీరపునాయునిపల్లె మండలంలో కాలువలో దూకి వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. భర్తపై కోపంతో బలవన్మరణానికి పాల్పడి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
భర్తపై కోపంతో వివాహిత ఆత్మహత్య