ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కడప జిల్లాలో వివాహిత ఆత్మహత్య...కేసు నమోదు - బద్వేల్​లో వివాహిత ఆత్మహత్య

కడప జిల్లా బద్వేల్ పురపాలికలోని చెన్నంపల్లి ప్రగతినగర్​లో అత్తింటి వేధింపులు తాళలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కడప జిల్లాలో వివాహిత ఆత్మహత్య
కడప జిల్లాలో వివాహిత ఆత్మహత్య

By

Published : May 27, 2021, 9:44 PM IST

కడప జిల్లా బద్వేల్ పురపాలికలోని చెన్నంపల్లి ప్రగతి నగర్​లో విషాదం జరిగింది. అత్తింటి వేధింపులు తాళలేక దీపిక అనే వివాహిత ఆత్మహత్య చేసుకుంది. నాలుగేళ్ల కిందట దీపికకు అదే గ్రామానికి చెందిన రూబెన్​తో వివాహం జరిగింది. పెళ్లైనప్పటి నుంచి భర్తతో పాటు అత్త, ఆడబిడ్డలు అనుమానం పెట్టుకొని వేధించేవారు. నిన్న రాత్రి భర్త రూబెన్...దీపికతో గొడవపడ్డాడు. ఇతనితో పాటు అత్త, ఆడబిడ్డలు ఆమెను మానసికంగా వేదనకు గురిచేశారు. దీన్ని భరించలేని దీపిక గదిలోకి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. తన కుమార్తె మృతికి భర్త, అత్త, ఆడబిడ్డలే కారణమని మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details