కడప జిల్లా బద్వేలులో అధికారుల నిర్లక్ష్యంతో ఓ మహిళ ఓటుహక్కును కోల్పోయింది. తన ఓటర్ స్లిప్పుతో వేరే వారికి ఓటు వేసే అవకాశమిచ్చారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తన ఓటు మరొకరితో ఎలా వేయించారని అధికారులను అడగగా.. పొరపాటు జరిగిందని.. తర్వాత బ్యాలెట్ ద్వారా ఓటు వేయిస్తామని చెప్పారన్నారు. బయట ఎంతసేపు వేచి చూసినా ఎవరూ పట్టించుకోకపోవడంతో... విషయాన్ని ఆర్ఓ దృష్టికి తీసుకెళ్లారు. సిబ్బందికి సరైన శిక్షణ ఇవ్వకపోవడం వల్లే తన ఓటు కోల్పోవలసి వచ్చిందని ఆమె తెలిపారు.
ఆధికారుల నిర్లక్ష్యం.. ఓటు హక్కు కోల్పోయిన మహిళ - 2019 election
అధికారుల నిర్లక్ష్యంతో ఓ మహిళ ఓటు హక్కును కోల్పోయింది. తన ఓటును వేరే వారితో వేయించడంపై ఆవేదన వ్యక్తం చేసింది. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని అధికారులు పట్టించుకోలేదన్నారు.
ఒకరి ఓటు మరొకరితో వేయించిన అధికారులు