కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో ఎక్కువ శాతం రైతులు హార్టికల్చర్పైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. వీటిలో ముఖ్యంగా చీనీ, అరటి సాగు చేశారు. కరోనా వైరస్ నేపథ్యంలో ఈ పంటల దిగుబడి ఎగుమతులు కాక రైతులు తీవ్ర స్థాయిలో నష్టపోతున్నారని జిల్లా నాయకులు.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.
హార్టికల్చర్ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పంటను ప్రభుత్వం కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. మార్కెటింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ మధుసూదన్ రెడ్డి.. లింగాల మండలంలో పర్యటించారు. చీనీ, అరటి పంటను పరిశీలించారు. ఎంపీ అవినాష్ రెడ్డి ఆయన వెంట ఉన్నారు. పంటను మద్దతు ధరతో ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు.