సంక్రాంతి పండగను పురస్కరించుకొని కడప జిల్లా రాజంపేట మండలం సింగనవారిపల్లిలో మారమ్మ అమ్మవారి గుండ మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ వేడుకతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం ఏర్పడింది. అమ్మవారి మాలలు ధరించిన భక్తులు ఉదయం నుంచి దీక్ష చేపట్టారు. అనంతరం మారమ్మ తల్లి కలశాలతో గ్రామోత్సవం నిర్వహించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి దీక్ష విరమించారు. పదేళ్ల తర్వాత గుండ మహోత్సవం నిర్వహించడంతో ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
మారమ్మ అమ్మవారి గుండ మహోత్సవం - Maramma devi Gundam Mahotsavam at singanavaripally news
కడప జిల్లా రాజంపేట మండలం సింగనవారిపల్లిలో సంక్రాంతి పండగను పురస్కరించుకొని మారమ్మ అమ్మవారి గుండ మహోత్సవం జరిగింది. పదేళ్లకు ఒకసారి ఈ గుండ మహోత్సవం నిర్వహిస్తారు.
మారమ్మ అమ్మవారి గుండ మహోత్సవం