కడప జిల్లా ప్రొద్దుటూరు రోటరీ క్లబ్ పేదలకు ఇళ్లు కట్టించేందుకు హౌసింగ్ స్కీమ్‌ను ప్రారంభించింది. ఇందులో భాగంగా ఇరవై రెండు కుటుంబాలకు గృహాలు నిర్మించి ఇవ్వాలని నిర్ణయించింది. ఇండ్లు కట్టేందుకు 2017లో భూమిరెడ్డి గంగిరెడ్డి అనే వ్యక్తి స్థలం దానం చేశాడు.
రోటరీ క్లబ్ ఇళ్ల నిర్మాణంలో అవకతవకలు..8మంది అరెస్టు - rotari club housing scheme news
కడప జిల్లా ప్రొద్దుటూరు రోటరీ క్లబ్ చేపట్టిన హౌసింగ్ స్కీమ్‌లో జరిగిన అవకతవకలపై ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరని రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు.
రోటరీ క్లబ్ హౌసింగ్ స్కీమ్‌లో అవకతవకలు
ఇళ్ల నిర్మాణంలో అవకతవకలు జరిగాయని గంగిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని పోలీసులు చెప్పారు. దీనికి సంబంధించి పదమూడు మందిని నిందితులుగా గుర్తించామన్నారు. అందులో ఎనిమిది మందిని అరెస్ట్ చేసి రిమాండుకు పంపినట్లు తెలిపారు.
ఇదీ చదవండి: భవానిపురంలోని పరుపుల కంపెనీలో అగ్నిప్రమాదం