కడప జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గంలో మామిడి తోటలు అధికం. ఇతర రాష్ట్రాలకూ ఇక్కడి నుంచి మామిడికాయలు ఎగుమతి అవుతుంటాయి. ఏటా 200కోట్లకుపైగా వ్యాపారం జరుగుతోంది. సుమారు రెండేళ్లుగా గిట్టుబాటు ధర లేక నష్టపోతున్న రైతులను కరోనా మరింత దెబ్బతీసింది. ఎగుమతులు నిలిచిపోవడం సహా...జ్యూస్ పరిశ్రమల యజమానులు దారుణంగా ధరలు తగ్గిస్తున్నారని రైతులు వాపోతున్నారు. కాయలపై మచ్చలు ఉంటే కొనట్లేదని... చాలా మంది రైతులు మార్కెట్లలోనే వదిలేసి వెళ్లిపోతున్నారు.
Mango farmers Problems:నష్టాల్లో మామిడి...కష్టాల్లో రైతులు! - నష్టాల్లో మామిడి రైతులు
మామిడి తోటలకు ప్రసిద్ధి చెందిన రైల్వేకోడూరు నియోజకవర్గంలో రైతులు నష్టాలు ఎదుర్కొంటున్నారు. గిట్టుబాటు ధర లేకపోవడం సహా జ్యూస్ పరిశ్రమల యజమానులు సిండికేట్‌గా మారారని ఆవేదన చెందుతున్నారు.
Mango farmers Problem
మైసూర్ వారిపల్లి పంచాయతీ పరిధిలోని వ్యాపారులంతా ఒకటిగా ఏర్పడి ఓ ప్రైవేట్ మార్కెట్ యార్డు ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఎన్నేళ్లైనా ఇక్కడ కనీస మౌలిక సదుపాయాలు కల్పించలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి:Jungle Cat Died: రోడ్డు ప్రమాదంలో అడవి పిల్లి మృతి