కడప జిల్లా ముద్దనూరులో కర్ణాటకు చెందిన ఓ డ్రైవర్‌ను చెట్టుకు కట్టి... గుర్రప్ప ట్రాన్స్పోర్ట్ యజమాని తన అనుచరులతో విచక్షణారహితంగా కొట్టించాడు. తన ట్రాన్స్‌పోర్ట్‌లో డ్రైవర్‌గా పని చేస్తున్న సదరు వ్యక్తి.. సిమెంట్ బస్తాలు దొంగలించాడనే నెపంతో చెట్టుకు కట్టి కొట్టారు. బాధిత డ్రైవర్ తనకు ఏమీ తెలియదనీ.. తనను వదిలివేయాలని ఎంత వేడుకున్నా.. వారు కనికరించలేదు. ఈ అమానవీయ ఘటన ఈ బుధవారం జరగ్గా.. ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. బాధిత డ్రైవర్‌ను వదిలివేసినా.. ఇప్పటికీ ఇంటికి చేరలేదని తెలిసింది. ఈ ఘటనపై జిల్లా పోలీసు ఉన్నతాధికారులు సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనను సుమోటోగా ఎందుకు తీసుకోలేదని ముద్దనూరు పోలీసులను ఉన్నతాధికారులు ప్రశ్నించినట్లు సమాచారం.
సిమెంట్ దొంగలించాడని... చెట్టుకు కట్టి కొట్టేశారు! - man brutally beaten by owner in muddanur
అన్నా అమ్మతోడు అన్నా.. నాకు తెలియదన్నా.. అని వేడుకుంటున్నా వారు కనికరించలేదు. నువ్వే చేశావని ఒప్పుకో... లేకపోతే విడిచేదే లేదు అంటూ చెట్టుకు కట్టి మరీ ఓ వ్యక్తిని కొట్టారు. ఈ ఘటన కడప జిల్లా ముద్దనూరులో జరిగింది.
![సిమెంట్ దొంగలించాడని... చెట్టుకు కట్టి కొట్టేశారు! man was brutally beaten by owner](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8661203-631-8661203-1599115746475.jpg)
చెట్టుకు కట్టి కొట్టేశారు