కడప జిల్లా సుండుపల్లి మండలం ముడుంపాడులో గ్రామంలో దారుణం జరిగింది. గ్రామానికి చెందిన మౌలాలి అనే వ్యక్తి ట్రాక్టర్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో... ఆ మహిళ బంధువులు కాపు కాసి ద్విచక్రవాహనంపై వెళుతున్న మౌలాలిపై శివరాంపురం వద్ద కత్తులతో దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని హత్యకు దారి తీసిన పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ లింగప్ప పేర్కొన్నారు.
మహిళతో వివాహేతర సంబంధం.. కాపు కాసి... దాడి చేసి హత్య - కడప జిల్లా తాజా వార్తలు
కడప జిల్లా సుండుపల్లి మండలం ముడుంపాడులో గ్రామంలో దారుణం జరిగింది. గ్రామానికి చెందిన ఒక వ్యక్తి ట్రాక్టర్ డ్రైవర్గా పని చేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని అనుమానంతో... ఆ మహిళకు సంబంధించిన వ్యక్తులు కాపు కాసి అతనిపై కత్తులతో దాడి చేసి హతమార్చినట్లు తెలిసింది.

మహిళతో అక్రమ సంబంధం ఉందని వ్యక్తిపై దాడి