Suicide attempt: వైఎస్ఆర్ జిల్లా ముద్దనూరులో బాలరాజు అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. అతడిని ప్రొద్దుటూరు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ముద్దనూరు ఏఎస్ఐ ఆంజనేయులు కొట్టడంతో మనస్థాపం చెంది.. తన కుమారుడు ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్లు తండ్రి హుస్సేనప్ప ఆరోపించారు. బాలరాజు దంపతులు గొడవ పడటంతో అతడి భార్య పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు తమను విచారణకు పిలిపించారన్నారు. ఈ క్రమంలో తాము చెప్పింది వినకుండా ఏఎస్ఐ ఆంజనేయులు తన కుమారుడు బాలరాజుతో పాటు.. తననూ కూడా కొట్టారని తండ్రి ఉసేనప్ప ఆవేదన వ్యక్తం చేశారు.
Suicide attempt: వ్యక్తి ఆత్మహత్యాయత్నం.. కారణం అదేనా..? - కడప జిల్లా తాజా వార్తలు
Suicide attempt: ముద్దనూరులో దంపతుల గొడవ పోలీస్‌స్టేషన్‌కు చేరగా.. భర్త ఆత్మహత్యాయత్నం చేశాడు. ఏఎస్సై కొట్టడంతోనే తన కుమారుడు పురుగుల మందు తాగాడని బాధితుడి తండ్రి ఆరోపించాడు. అంతటితో ఆగకుండా తనపై కూడా చేయి చేసుకున్నాడని వాపోయాడు.
ఆత్మహత్యాయత్నం