కడప జిల్లా లక్కిరెడ్డిపల్లె మండలం కస్తూరిరాజుగారిపల్లిలో దారుణ హత్య జరిగింది. గ్రామానికి చెందిన ధర్మయ్య అనే వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసి... మృతదేహాన్ని గ్రామ సమీపంలో పడేశారు. గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించడంతో... వారు సంఘటన స్థలానికి చేరుకొని హత్యకు దారి తీసిన పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. మృతుడు బ్రహ్మయ్య గొంతు నులిమి ఎలాంటి గాయాలు లేకుండా హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమై ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని లక్కిరెడ్డిపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించి... కేసు నమోదు చేశారు.
హత్య చేసి... గ్రామ శివార్లలో పడేసి - కడపలో వ్యక్తి హత్య
కడప జిల్లా లక్కిరెడ్డిపల్లె మండలం కస్తూరిరాజుగారిపల్లిలో దారుణం జరిగింది.గ్రామానికి చెందిన ధర్మయ్య అనే వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసి... మృతదేహాన్ని గ్రామ సమీపంలో పడేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
హత్య చేసి... గ్రామ శివార్లలో పడేసి