ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

MURDER: వ్యక్తి దారుణ హత్య.. పాతకక్షలే కారణం! - కడప జిల్లా క్రైం న్యూస్

పాతకక్షల కారణంగా ఓ వ్యక్తి దారుణ హత్య(murder)కు గురయ్యాడు. కత్తితో విచక్షణా రహితంగా పొడిచాడు. బాధితుడు అక్కడికక్కడే మృతి (death) చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు (case file) చేశారు. ఈ ఘటన కడప జిల్లాలోని దేవుని కడపలో జరిగింది.

కడపలో వ్యక్తి హత్య
కడపలో వ్యక్తి హత్య

By

Published : Aug 12, 2021, 10:51 PM IST

కడప నగరంలోని రవీంద్రనగర్ కు చెందిన సయ్యద్ సంధాని.. రెండు నెలల క్రితం గల్ఫ్ నుంచి కడపకు వచ్చాడు. సంధానికి పెళ్లి చేసేందుకు అతని తల్లిదండ్రులు సంబంధాలు చూస్తున్నారు. మరోవైపు.. వారం క్రితం సంధాని కొందరితో గొడవ పడ్డాడు. ఈ ఘటనతో ఆ వ్యక్తులు సంధానిని ఎలాగైనా చంపాలని కక్ష పెంచుకున్నారు.

కాగా... సంధాని స్నేహితునికి కుమారుడు జన్మించడంతో వేడుక చేసుకునేందుకు.. వారు దేవునికడప చెరువు వద్దకు వెళ్లారు. విషయం తెలుసుకున్న సంధాని ప్రత్యర్థులు.. ఆ చెరువు వద్దకు వెళ్లి ఘర్షణ పడ్డారు. అతనిపై కత్తులతో మూకుమ్మడిగా దాడి చేశారు. ఈ దాడిలో సంధానికి 5 నుంచి 10 వరకు కత్తి పోట్లు పడ్డాయి. తీవ్ర గాయాలపాలైన సంధాని అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న డీఎస్పీ సునీల్.. ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details