కడప జిల్లా పులివెందులలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. పులివెందుల నియోజకవర్గంలోని వేముల మండలానికి చెందిన ఒక వ్యక్తి కొవిడ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతిచెందిన వ్యక్తి మృతదేహాన్ని పూడ్చడానికి మున్సిపల్ అధికారులు పులివెందులలోని రెండో వార్డులో ఉన్న శ్మశానవాటికలో గుంత తవ్వడానికి జేసీబీని పంపించారు.
కరోనాతో వ్యక్తి మృతి... అంత్యక్రియలను అడ్డుకున్న స్థానికులు - corona effect on pulivendula
కడప జిల్లా పులివెందులలో కరోనా కోరలు చాస్తోంది. తాజాగా ఓ వ్యక్తి కొవిడ్ కారణంగా మృతి చెందారు. కాగా... ఆ మృతదేహాన్ని పూడ్చడానికి మున్సిపల్ అధికారులు చేసిన ఏర్పాట్లను స్థానికులు అడ్డుకున్నారు. ఫలితంగా కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
కరోనాతో వ్యక్తి మృతి... అంత్యక్రియలను అడ్డుకున్న స్థానికులు
ఈ విషయం తెలుసుకున్న స్థానికులు జేసీబీని అడ్డుకున్నారు. కరోనాతో మృతిచెందిన వ్యక్తి మృతదేహాన్ని ఇక్కడ ఎలా పూడ్చుతారని అధికారులను ప్రశ్నించారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విషయం తెలుసుకున్న మున్సిపల్ అధికారులు, పోలీసులు ఘటనా ప్రదేశానికి చేరుకుని స్థానికులకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. స్థానికులు ఒప్పుకోకుండా అక్కడే బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండీ... పనిచేసే చోటే కబళించిన మృత్యువు