కడప జిల్లా పెండ్లిమర్రి మండలం చీమలపెంట గ్రామంలో విషాదం జరిగింది. గ్రామానికి చెందిన రామాంజనేయులు రెడ్డి బట్టలు కుడుతూ జీవనం సాగిస్తున్నాడు. అయితే రామాంజనేయరెడ్డి శానిటైజర్ తాగి పడిపోవటాన్ని గమనించిన స్థానికులు అతడిని రిమ్స్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. రామాంజనేయరెడ్డి మృతితో అతని కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పెండ్లమర్రిలో శానిటైజర్ తాగి వ్యక్తి మృతి - కడపలో శానిటైజర్ తాగి వ్యక్తి మృతి
కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం పెండ్లిమర్రి మండలంలో విషాదం జరిగింది. శానిటైజర్ తాగి గ్రామానికి చెందిన రామాంజనేయరెడ్డి అనే వ్యక్తి మృతి చెందాడు. అతని మృతితో కుటుంబం విషాదంలో మునిగిపోయింది. పోలీసులు కేసు నమోదు చేశారు.
పెండ్లమర్రిలో శానిటైజర్ తాగి వ్యక్తి మృతి