ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వాగులో వ్యక్తి గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు - వాగులో వ్యక్తి గల్లంతు

కడప జిల్లా వల్లూరు మండల పరిధిలోని దిగువపల్లె గ్రామ సమీపంలోని వాగులో ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. కడపకు వెళ్లి పనులు చూసుకుని తిరిగి ఇంటికి చేరే క్రమంలో వాగు దాటుతుండగా ప్రవాహ ఉద్ధృతిలో కొట్టుకుని పోయాడు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

man fell into to river
వాగులో వ్యక్తి గల్లంతు

By

Published : Jul 19, 2021, 10:40 AM IST

కడప జిల్లా వల్లూరు మండల పరిధిలోని దిగువపల్లె గ్రామ సమీపంలో.. ఒ వ్యక్తి వాగులో గల్లంతయ్యాడు. గ్రామానికి చెందిన సుధాకర్‌.. ఆదివారం కడపకు వెళ్లి ఇంటికి తిరిగి వస్తుండగా గ్రామం ముంగిట ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగులో ప్రమాదవశాత్తు పడిపోయి కొట్టుకుపోయాడు. సుధాకర్‌, శశికళ దంపతులు చిన్నపాటి కూలీ పనులు చేసుకుని జీవించే వారు. ఇటీవల సుధాకర్‌ రాడ్‌బెండర్‌ పనినేర్చుకుని నిత్యం కడపకు వెళ్లి పనిచేసుకుని ఇంటికి వచ్చేవాడు. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు రహదారి మధ్యలోనే కాజ్‌వేపై వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. సుధాకర్‌ ఆదివారం ఉదయం కడపకు వెళ్లి పనులు చూసుకుని తిరిగి ఇంటికి చేరే క్రమంలో వాగు దాటుతుండగా ప్రవాహ ఉద్ధృతిలో కొట్టుకుని పోయాడు.

నిర్లక్ష్యమే.. ముప్పును తెచ్చి పెట్టింది

ఉదయం వాగులోకి దిగుతుండగా అక్కడున్న వారు దిగవద్దని వారించారు. అయినా వినకుండా అలానే దాటుకుని వెళ్లాడు. అచ్చం అదే మాదిరిగా ఏం కాదులే అంటూ మధ్యాహ్నం వాగులోకి దిగాడు. ప్రవాహం ఎక్కువగా ఉండటంతో దిగిన వెంటనే కొట్టుకుపోయాడు. సుధాకర్‌, శశికళ దంపతులకు కూతురు శృతి(10), కుమారులు అజయ్‌(6), విజయ్‌(4) సంతానం ఉన్నారు. ఉదయం పనికి వెళ్లిన భర్త మధ్యాహ్నం వాగులో కొట్టుకుపోయిన విషయం తెలిసినప్పటి నుంచి కుటుంబం తీవ్ర విషాదంలో మునిగింది. వల్లూరు ఎస్‌ఐ కల్పన, పెండ్లిమర్రి ఎస్‌ఐ కొండారెడ్డిలు సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. వాగులోకి ఎవరూ దిగకుండా గట్టి హెచ్చరికలు జారిచేశారు. చుట్టుపక్కల గాలింపు చర్యలు చేపట్టారు. అయినా ఆచూకీ లభించలేదు.

ABOUT THE AUTHOR

...view details