ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాత్రి టిప్పర్​ క్యాబిన్​లో నిద్ర.. తెల్లారేసరికి మృతి - చిలమకూరు ఐసీఎల్ ఫ్యాక్టరీ

టిప్పర్​లో నిద్రిస్తున్న వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం చిలమకూరు ఐసీఎల్ ఫ్యాక్టరీ వద్ద చోటు చేసుకుంది. క్యాబిన్​లో నిద్రపోయిన అతన్ని తెల్లవారుజామున తోటి డ్రైవర్లు లేపడానికి ప్రయత్నించగా.. జీవచ్ఛవంగా ఉండటంతో పోలీసులకు సమాచారం అందించారు.

man died in lorry cabin in yerraguntla
టిప్పర్​లో నిద్రిస్తున్న డ్రైవర్ మృతి

By

Published : Jan 10, 2021, 3:59 PM IST

కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం చిలమకూరు ఐసీఎల్ ఫ్యాక్టరీ బయట నిలిపి ఉన్న టిప్పర్​లో నిద్రిస్తున్న నాగార్జున (30) అనే డ్రైవర్ మృతి చెందాడు. రాత్రి టిప్పర్ క్యాబిన్​లోనే నిద్రిస్తూ ఉదయానికల్లా మృతి చెందినట్లు తోటి డ్రైవర్లు తెలిపారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా.. అక్కడికి చేరుకున్న పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. మృతుడు ఎర్రగుంట్ల పట్టణంలోని నారాయణ నగర్​కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. అతనికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భర్త మరణవార్త విని ఇద్దరు పిల్లలతో అక్కడికి చేరకున్న భార్య కన్నీరుమున్నీరైన తీరు స్థానికులను కలచివేసింది.

ABOUT THE AUTHOR

...view details