కడప జిల్లా మైదుకూరు సమీపంలోని చిత్తూరు-కర్నూలు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పట్టణంలోని పాతూరుకు చెందిన గంగారపు కుమార్ ద్విచక్రవాహనంపై వెళ్తున్నాడు. ఈ క్రమంలో మైదుకూరు వద్దకు చేరుకోగానే కుమార్ ద్విచక్రవాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఏఎస్సై పాండురంగారెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
గుర్తుతెలియని వాహనం ఢీ కొని యువకుడు మృతి - kadapa district crime
కడప జిల్లా మైదుకూరులో రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని గుర్తుతెలియని వాహనం ఢీ కొన్న ఈ ఘటనలో ఓ యువకుడు మృతి చెందాడు.
![గుర్తుతెలియని వాహనం ఢీ కొని యువకుడు మృతి accident in maidukooru](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11700934-762-11700934-1620577359925.jpg)
మైదుకూరు రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి