నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం పడమటినాయనపల్లె గ్రామానికి చెందిన వెంకటసుబ్బయ్య మైదుకూరు వెళ్తున్నాడు. కడప జిల్లా పుల్లయ్యస్వామి సత్రం వద్దకు చేరుకోగానే వెంకటసుబ్బయ్యను ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. కిందపడిపోయాడు. ఇదే సమయంలో అటుగా వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి వెంకటసుబ్బయ్య మీద నుంచి వెళ్లింది.
ఈ ఘటనలో బాధితుడికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం ప్రొద్దుటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా... అక్కడ చికిత్స పొందుతూ వెంకటసుబ్బయ్య మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.