కడప జిల్లా ఓబులవారిపల్లె మండలం ముక్కావారిపల్లిలో విషాదం జరిగింది. కారు ఢీకొని హరిజనవాడకు చెందిన జల్లి చంద్రయ్య అనే ఉపాధిహామీ కూలీ మృతిచెందాడు. ముక్కవారిపల్లి బ్రిడ్జ్ దగ్గర కారు ఢీకొట్టగా అక్కడికక్కడే ప్రాణం విడిచాడని స్థానికులు తెలిపారు. రోడ్డుపక్కన నడుచుకుంటూ వెళ్ళినా మృత్యువు కారు రూపంలో వచ్చి చంద్రయ్య పొట్టన పెట్టుకుందని బంధువులు బోరున విలపించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై డాక్టర్ నాయక్ తెలిపారు.
కారు ఢీకొని ఉపాధి కూలీ మృతి - man dead in road accident news
కారు ఢీకొని ఉపాధి హామీ కూలీ మరణించిన ఘటన కడప జిల్లా ఓబులవారిపల్లెలోని ముక్కావారిపల్లిలో చోటు చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కారు ఢీకొని వ్యక్తి మృతి