కడప జిల్లా రైల్వే కోడూరు మండలం గంగరాజుపురం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రధాన రహదారిపై సైకిల్‌పై వెళ్తున్న యువకుడిని గుర్తుతెలియని వాహనం ఢీకొంది. ఈ ఘటనలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు షేక్ హుస్సేన్ బాషా, కడప జిల్లా వెలమలకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి - కడప జిల్లాలో రోడ్డు ప్రమాదం తాజా వార్తలు
గుర్తుతెలియని వాహనం ఢీకొని యువకుడు మృతిచెందిన ఘటన కడప జిల్లా గంగరాజుపురం వద్ద జరిగింది. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
అనంతపురం జిల్లా బేలుగుప్ప మండలం గుండ్లపల్లి రహదారి వద్ద తెల్లవారుజామున గుర్తుతెలియని వాహనం ఢీకొని జింక మృతి చెందింది. జింక రోడ్డు దాటుతున్న సమయంలో వేగంగా వచ్చిన గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. అటవీశాఖ అధికారులు జింక మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి ఖననం చేశారు. ఎండవేడికి తట్టుకోలేక నీటికోసం అడవి వదిలి బయటకు వస్తున్న జింకలు ఇలా రోడ్డు ప్రమాద బారినపడి మృతి చెందుతున్నాయని స్థానికులు చెబుతున్నారు.
ఇవీ చూడండి...
ప్రొద్దుటూరులో బైక్ ఢీకొన్న కారు... ఇద్దరు మృతి
Last Updated : May 27, 2020, 9:04 PM IST