ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అక్రమ సంబంధం... తీసింది ప్రాణం - రాయచోటిలో వ్యక్తి దారుణ హత్య

మూడేళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా కొనసాగిన వివాహేతర సంబంధం ఓ వ్యక్తి ప్రాణాల తీసింది. ప్రియురాలి ఇంటికి వచ్చిన ప్రియుడిని భర్తతో కలిసి దారుణంగా హతమార్చింది ఓ మహిళ. ఈ ఘటన కడప జిల్లా రాయచోటిలో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

మృతి చెందిన యూసఫ్
మృతి చెందిన యూసఫ్

By

Published : Dec 4, 2020, 2:38 AM IST

కడప జిల్లా రాయచోటిలో వివాహేతర సంబంధం ఓ వ్యక్తి హత్యకు దారితీసింది. రాజుల కాలనీకి చెందిన యూసఫ్ కొలిమిమిట్టకు చెందిన ఓ వివాహితతో మూడేళ్లుగా వివాహేతర సంబంధం ఉంది. గతంలో ఈ విషయంపై ఆ మహిళ భర్త.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు వీరిరువురికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. ఈ ఘటనతో మార్పు కలగని యూసఫ్ మళ్లీ ఆ మహిళకు దగ్గరయ్యేందుకు ప్రయత్నించాడు.

ఈ క్రమంలో గురువారం రాత్రి ప్రియురాలి ఇంటికి వెళ్లిన యూసఫ్​ను.. మహిళ, ఆమె భర్త మౌలాలితో కలిసి దారుణంగా తలపై కొట్టారు. ఈ ఘటనలో యూసఫ్ అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు... హత్యకు పాల్పడిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

ఇదీ చదవండి

నివర్ వరదలు... మునిగిన పంటలు

ABOUT THE AUTHOR

...view details