కడప జిల్లా బద్వేలు సుందరయ్యకాలనీలో ఈనెల 8న హరీశ్ అనే వ్యక్తి.. తన భార్యను హత్య చేశాడు. వ్యాపారం కోసం మంజుల వద్ద ఉన్న బంగారు ఆభరణాలు ఇవ్వకపోవడంపై ఆగ్రహంతో ఈ ఘటనకు పాల్పడ్డాడని పోలీసులు వెల్లడించారు.
హత్య ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారిస్తుండగా... నక్కలగండి వద్ద హరీశ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అతని నుంచి హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న హరీశ్ తల్లి లక్ష్మీదేవి కోసం గాలిస్తున్నారు.