అమ్మాయిలను మోసగించి లైంగికంగా వేధింపులకు గురిచేస్తున్న ఓ కీచకుడిని కడప జిల్లా ప్రొద్దుటూరు పోలీసులు అరెస్టు చేశారు. కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం పడ్యాలకు చెందిన రాజ్‌కుమార్ డిగ్రీ వరకు చదువుకున్నాడు. ఫేస్బుక్ వేదికగా అమ్మాయిలకు వల విసిరేవాడు. కాస్త పరిచయమయ్యాక వారితో ఫొటోలు దిగేవాడు. అనంతరం వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించి వారిని లైంగికంగా వేధించేవాడు. మరో ఆశ్చర్యకర విషయం ఏంటంటే.. నిందితుడికి బట్ట తల కాగా... విగ్ పెట్టుకొని ఉన్న ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పెట్టేవాడని డీఎస్పీ సుధాకర్ వెల్లడించారు.
ఫేస్బుక్లో వేషం మార్చి... మోసం చేస్తూ.. - ఫేస్‌బుక్‌తో అమ్మాయిల్ని మోసం చేస్తున్న వ్యక్తి అరెస్టు
ఫేస్బుక్లో అమ్మాయిలతో తియ్యని మాటలు చెప్తాడు. మెసేజ్‌లూ చేస్తాడు. ఫోటోలు దిగుతాడు. చివరకు సోషల్ మీడియాలో బట్టబయలు చేస్తానంటూ నమ్మించి... లైంగికంగా వేధిస్తాడు. ఆ ఘనుడు చదివింది డిగ్రీ.. చేస్తున్న అదనపు పని ఓ ప్రైవేటు స్కూల్‌ని నడపడం. అన్నట్టు అసలు విషయం ఏమంటే అతని అందం వెనుక ఓ రహస్యం కూడా ఉందండోయ్!.
ఫేస్బుక్లో వేషం మార్చెను... మోసం చేసెను
రాజ్‌కుమార్ ప్రస్తుతం రాజుపాలెం మండలంలో ఓ ప్రైవేట్ పాఠశాలను లీజుకు తీసుకుని నడుపుతున్నాడు. అదే పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న ఓ అబలను... ఇతరులతో కలిసి మోసం చేశాడు. ఆమెను కార్లో బలవంతంగా తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టాడని డీఎస్పీ తెలిపారు. రాజ్‌కుమార్‌పై పలు రాష్ట్రాల్లో 10 కేసులు ఉన్నట్లు వెల్లడించారు. ఇన్నీ చేసి తప్పించుకుంటున్న అతన్ని... వెల్లాల గ్రామం వద్ద పోలీసులు పట్టుకున్నారు.