ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జడ్జి రామకృష్ణను వెంటనే విడుదల చేయాలి : మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు - మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షులు ఈశ్వర్ తాజా వార్తలు

జడ్జి రామకృష్ణ పై దేశ ద్రోహం కేసు నమోదు చేయడం దారుణమని మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షులు ఈశ్వర్ ఖండించారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దళితులపై దాడులు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు.

మాలమహానాడు ప్రెసిడెంట్​
malamahanadu president

By

Published : Apr 23, 2021, 5:33 PM IST

జడ్జి రామకృష్ణ పై పెట్టిన కేసును ఉపసంహరించుకోవాలని మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు ఈశ్వర్ డిమాండ్​ చేశారు. కడప ప్రెస్​క్లబ్​లో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రామకృష్ణ పై వైకాపా ప్రభుత్వం వ్యక్తిగత కక్షలకు వెళ్తోందని ఈశ్వర్ ఆరోపించారు. ప్రస్తుతం రామకృష్ణ కరోనాతో బాధపడుతున్నారని తక్షణం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

గతంలో సీఎం జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడును నడిరోడ్డుపై కాల్చి చంపాలని అనడం కూడా దేశద్రోహం కిందికే వస్తుందని మరి ఆయనపై ఎందుకు కేసు నమోదు చేయలేదని ఎద్దేవా చేశారు. వైకాపా ప్రభుత్వానికి దళితులంటే గిట్టదని పేర్కొన్నారు. తక్షణం రామకృష్ణను విడుదల చేయకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు.

ఇదీ చదవండీ..ధూళిపాళ్ల నరేంద్రను విచారించిన అ.ని.శా. అధికారులు

ABOUT THE AUTHOR

...view details