లాక్ డౌన్ కారణంగా కడపలో ఉంటున్న 500 మంది ఉత్తరప్రదేశ్ వలస కూలీలను రెవెన్యూ, పోలీసు అధికారులు స్వస్థలాలకు పంపిస్తున్నారు. కడప ఆర్&బీ అతిథి గృహం నుంచి బస్సుల ద్వారా రైల్వే స్టేషన్కి తరలించారు. అక్కడినుంచి రైలు మార్గాన మధ్యాహ్నం రెండు గంటలకు రైలు బయలుదేరనుంది. జిల్లావ్యాప్తంగా మరికొంతమందిని విడతలవారీగా పంపేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
కడప నుంచి స్వస్థలానికి వెళ్లనున్న ఉత్తరప్రదేశ్ వలస కూలీలు - lockdown in kadapa
లాక్ డౌన్ నేపథ్యంలో కడపలో ఇరుక్కున్న 500 మంది ఉత్తరప్రదేశ్ వలస కూలీలను స్వస్థలాలకు పంపేందుకు అధికారులు చర్యలు చెపట్టారు. ఈరోజు మధ్యాహ్నం కడప నుంచి శ్రామిక్ రైలు బయలుదేరనుంది.
కడప నుంచి స్వస్థలానికి వెళ్తున్న 500 మంది ఉత్తరప్రదేశ్ వాసులు