ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

MYDUKUR MLA COMMENTS: 'లోకేశ్​ వల్లే తెలుగుదేశం పార్టీకి ఈ పరిస్ధితి' - వైకాపా ఎమ్మెల్యే రఘురామిరెడ్డి

లోకేశ్​ ప్రవర్తనతోనే తెలుగుదేశం పార్టీ రోజురోజుకూ దిగజారుతోందని మైదుకూరు వైకాపా ఎమ్మెల్యే రఘురామిరెడ్డి విమర్శించారు. తెదేపా నాయకులు తిట్టడం వల్ల ప్రజల్లో వైకాపాకు అభిమానంతోపాటు సానుభూతి పెరుగుతోందన్నారు. లోకజ్ఞానం తెలియని లోకేశ్​ మాటలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు.

మైదుకూరు వైకాపా ఎమ్మెల్యే రఘురామిరెడ్డి
మైదుకూరు వైకాపా ఎమ్మెల్యే రఘురామిరెడ్డి

By

Published : Oct 22, 2021, 7:21 PM IST

ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన తెలుగుదేశం పార్టీ నేడు లోకేశ్​ ప్రవర్తనతో అధోగతి పాలైందని మైదుకూరు వైకాపా ఎమ్మెల్యే రఘురామిరెడ్డి విమర్శించారు. లోకజ్ఞానం తెలియని లోకేశ్​ మాటలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. సర్పంచి కూడా కాలేని లోకేశ్​ దొడ్డిదారిన ఎమ్మెల్సీ అయ్యారని విమర్శలు చేశారు. అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి కుమారుడిగా మంగళగిరి నుంచి పోటీ చేసి ఓటమి పాలైన లోకేశ్​ రాజకీయాల గురించి మాట్లాడే అర్హతే లేదన్నారు.

తెదేపా నాయకులు తిట్టడం వల్ల ప్రజల్లో వైకాపాకు అభిమానంతోపాటు సానుభూతి పెరుగుతోందన్నారు. వ్యక్తి దూషణలకు పోకుండా పరిపాలన లోపాలపై సూచనలు, సలహాలు ఇచ్చి సహకారం అందించాలే కానీ.. స్థాయిని దిగజార్చుకోకుండా రాజకీయ విలువలు కాపాడుకోవాలని సూచన చేశారు. రాజకీయ నాయకులంటే ప్రజలు అసహ్యించుకునే పరిస్థితి రాకుండా చూసుకోవాలని కడప జిల్లా మైదుకూరు జనాగ్రహ దీక్షలో వ్యాఖ్యానించారు.

ఇదీ చదవండి:TDP Fire On YCP:సవాంగ్ డీజీపీ కాదు.. 'డీజేపీ'.. రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోంది: తెదేపా

ABOUT THE AUTHOR

...view details