ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మంగళగిరి కాబట్టి అలా చేశారు...అదే రాయలసీమ అయితే..ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు - kadapa district latest news

మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి...చంద్రబాబునాయుడు(chandrababu news) 36 గంటల దీక్షపై మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని తిట్టడమే కాకుండా రాష్ట్ర బంద్​కు పిలుపునిచ్చి...అది విఫలం కావటంతో దీక్ష నిర్ణయం తీసుకోవడం అ ప్రజాస్వామికమన్నారు.

ఎమ్మెల్యే రఘురామిరెడ్డి
ఎమ్మెల్యే రఘురామిరెడ్డి

By

Published : Oct 21, 2021, 5:04 PM IST

చంద్రబాబునాయుడు(chandrababu news) 36 గంటల దీక్షపై కడప జిల్లా మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళగిరి కాబట్టి పార్టీ కార్యాలయంపై రాళ్లు వేశారని, అదే రాయలసీమలో అయితే ఖూనీలు జరిగేవని హెచ్చరించారు. వైకాపా చేపట్టిన 48 గంటల దీక్షలో భాగంగా మైదుకూరులో చేపట్టిన నిరసన దీక్షలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని నోటితో చెప్పలేని భాషలో తిట్టడమే గాక రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చి.. అది విఫలం కావడంతో 36 గంటల దీక్షకు నిర్ణయం తీసుకోవడం అప్రజాస్వామికమన్నారు.

మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి

అసభ్యంగా మాట్లాడిన వారిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేసి క్షమాపణ చెబితే గౌరవం ఉంటుందన్నారు. శాంతి భద్రతల సమస్యలను సృష్టించి ప్రభుత్వాన్ని అప్రతిష్ఠ పాలు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. తెదేపా హయాంలో ఎన్నో హత్యలు జరిగినా రాష్ట్రపతి పాలన విధించలేదని, ఇప్పుడు ఎన్ని ఖూనీలు జరిగాయని రాష్ట్రపతి పాలన అడుగుతున్నారని ప్రశ్నించారు.

ఇదీ చదవండి:

రాష్ట్రవ్యాప్తంగా వైకాపా నిరసనలు.. జనాగ్రహం పేరిట ఆందోళనలు

ABOUT THE AUTHOR

...view details