జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ... డీఎస్పీ సూర్యనారాయణ 40 మంది కానిస్టేబుళ్లతో... మహిళ రక్షక్ విభాగాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ కార్యాలయంలో... మహిళ కానిస్టేబుళ్లతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. డీఎస్పీ మాట్లాడుతూ... కళాశాలలు, బస్టాండ్లు ఇతర ప్రాంతాల్లో స్త్రీలకు రక్షణ కల్పించేందుకు మహిళా రక్షక్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఎవరికైనా ఏదైనా సమస్య వస్తే... వెంటేనే మహిళా రక్షక్ వారికి సమాచారం ఇవ్వాలని చెప్పారు. వారు కొండంత అండ కల్పిస్తారన్నారు. ఈ ఆదివారం మహిళా రక్షక్ను ఎస్పీ ప్రారంభిస్తున్నారు.
స్త్రీలకు అండగా... 'మహిళ రక్షక్' - కడప మహిళ రక్షక్ వార్తలు
జిల్లాలోని అతివలకు రక్షణ కల్పించేందుకు మహిళ రక్షక్ సిబ్బంది సిద్ధమౌతున్నారు. ఈ విభాగాన్ని ఎస్పీ ఆదివారం ప్రారంభించనున్నారని డీఎస్పీ సూర్యనారాయణ తెలిపారు.

మహిళలకు అండగా... మహిళ రక్షక్