ఆర్టీసీ చైర్మన్ వర్లరామయ్య సార్వత్రిక ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, ఆర్టీసీ చైర్మన్ వర్లరామయ్య, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ద్వివేదికి ఫిర్యాదు చేశారు. ఇంతగా నిర్లిప్తంగా ఉన్న ఎలక్షన్ కమిషన్ను ఎప్పుడూ చూడలేదని ఆయన ఆరోపించారు. కృష్ణా జిల్లా పెనమలూరు ఆర్వో ఈవీఎంలను 24 గంటలు ఇంట్లో పెట్టుకున్నారని, అయితే జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ తప్పు జరగలేదని... తప్పుడు రిపోర్టు ఇచ్చారని ఆరోపించారు. దీనిపై వెంటనే దర్యాప్తు జరిపించాలని కోరారు. కడప జిల్లా రైల్వే కొడూరు, 127 బూతులో పురుషుల ఓట్లు 337 వుండగా 370 ఓట్ల పొలయ్యాయని తెలిపారు. అక్కడ ఓట్లు 109 శాతం ఓటింగ్ నమోదైందని పేర్కొన్నారు.