బంధువుల నుంచి ప్రాణాలకు హాని ఉందని ఓ ప్రేమజంట హైకోర్టును ఆశ్రయించింది. ఈ నెల 14వ తేదీన ఆ జంట కాణిపాకంలో ప్రేమ వివాహం చేసుకుంది. అయితే యువతీ తరఫు బంధువుల నుంచి ప్రాణహాని ఉందని.. ఆ వధూవరులు హైకోర్టులో పిటిషన్ వేశారు. కాగా బంధువులు కూడా ఫిర్యాదు చేయగా.. గుంటూరులోని పెదకాకాని రెయిన్ ట్రీ పార్క్ విల్లాస్ వద్ద ఉన్న ఆ ప్రేమ జంటను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిది కడప జిల్లా సాంబేపల్లి మండలం దిగువ నల్లగుట్ట గ్రామంగా తెలిసింది.
ప్రాణ హాని ఉందని హైకోర్టును ఆశ్రయించిన ప్రేమజంట
ప్రాణ హాని ఉందని ఓ ప్రేమ జంట హైకోర్టును ఆశ్రయించింది. కడప జిల్లాకు చెందిన ఆ జంటకు ఈ నెల 14 కాణిపాకంలో ప్రేమ వివాహం జరిగింది. బంధువుల నుంచి ప్రాణాలకు అపాయముందని హైకోర్టులో పిటిషన్ వేసింది ఆ జంట.
lovers petition in high court