కడప జిల్లా ముద్దనూరులో సిమెంట్ లోడుతో వెళ్తున్న లారీ బీభత్సం సృష్టించింది. గేర్బాక్స్ ఊడిపోవటాన్ని గమనించుకోని డ్రైవర్ వాహనాన్ని అలాగే నడపటంతో ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న లారీ పట్టణం సమీపంలో ఉన్న రైల్వే గేట్లను ధ్వంసం చేస్తూ ఊరిలోకి ప్రవేశించింది. అదుపు తప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లి పోయింది. ఈ ఘటనలో డ్రైవర్ చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. మృతుడు మైలవరం మండలం చిన్న కొమ్మెర్ల గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. క్రేన్ల సహాయంతో లారీని బయటకు తీసేందుకు ప్రయత్నం చేస్తున్నారు.
ముద్దనూరులో లారీ బీభత్సం.. - accidents in kadapa
కడప జిల్లా ముద్దనూరులో లారీ బీభత్సం సృష్టించింది. పట్టణంలోని ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ మరణించినట్లు పోలీసులు తెలిపారు.
వేగం అదుపు తప్పి ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ