రాయచోటి నుంచి టమోటాల లోడుతో వస్తున్న లారీ గువ్వల చెరువు ఘాట్ రోడ్డు వద్దకు రాగానే అదుపుతప్పి బోల్తాపడింది. ఇంధన ట్యాంకర్ పగిలిపోవడంతో చమురంతా రోడ్డు పాలయింది. వాహనంలోని టమోటాలు నేలపాలయ్యాయి. పలువురు వాహనదారులు ఇంధనం పై వెళ్తూ కింద పడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇంధనం పై ఇసుక చల్లి బోల్తాపడ్డ వాహనాన్ని పక్కకు నెట్టి ట్రాఫిక్ ను క్రమబద్దీకరించారు. దాదాపు గంట పాటు ట్రాఫిక్ స్థంభించడంతో ఇరు వైపులా వాహనాలు బారులు తీరాయి.
ఘాట్ రోడ్లో లారీ బోల్తా.. డ్రైవర్, క్లీనర్‌కు స్వల్ప గాయాలు
కడప శివారులోని గువ్వల చెరువు ఘాట్ రోడ్డు వద్ద మంగళవారం రాత్రి వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్ స్వల్పంగా గాయపడ్డారు. ఎవరికీ ప్రాణాపాయం లేకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
ఘాట్ రోడ్ లో లారీ బోల్తా-డ్రైవర్,క్లీనర్ కు స్వల్ప గాయాలు