కడప-బెంగళూరు ప్రధాన రహదారిలోని... చిన్నమండెం సమీపంలో లారీ బోల్తా పడింది. బెంగళూరు నుంచి గిద్దలూరు మల్చింగ్ పేపర్ లోడుతో వెళ్తున్న లారీ చిన్నమండెం వద్దకు రాగానే రోడ్డు పక్కన నిలిపి డ్రైవర్ మూత్రవిసర్జన కోసం కిందకు దిగారు. అదే సమయంలో ఆగి ఉన్న లారీ కదిలి డ్రైవర్ రమేష్(50)పై పడడంతో అక్కడికక్కడే మృతి చెందారు.
బెంగళూరు జాతీయ రహదారిపై లారీ బోల్తా...డ్రైవర్ మృతి - lorry accident in cadapa dst
లారీ బోల్తా పడి డ్రైవర్ అక్కడిక్కడే చనిపోయాడు. కడప జిల్లాలోని బెంగళూరు ప్రధాన రహదారిపై జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి.

lorry boltha in cadapa dst driver spot dead
లారీలో ఉన్న పోరుమామిళ్లకు చెందిన చిన్నరాయుడు తీవ్రంగా గాయపడ్డారు. మృతుడు రమేష్ ప్రకాశం జిల్లా ఉసిరి గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ప్రమాదంపై చిన్నమండెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండిలాక్డౌన్ 4.0: బస్సులకు అనుమతి- సినిమా హాళ్లకు నో