LORRY ACCIDENT: కడప శివారు గువ్వల చెరువు ఘాట్ రోడ్డులోని మూడో మలుపు సమీపంలో రెండు లారీలు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో క్యాబిన్లో చిక్కుకున్న డ్రైవర్‌ను అగ్నిమాపక సిబ్బంది చాకచక్యంగా ప్రాణాలతో కాపాడారు. రాయచోటి వైపు నుంచి వస్తున్న లారీ.. కడప వైపు వెళ్తున్న మరో లారీ గువ్వల చెరువు ఘాట్‌రోడ్డులోని మూడో మలుపు సమీపంలో ఢీకొన్నాయి. స్థానికులు వెంటనే పోలీసులకు, అగ్నిమాపక కేంద్రానికి సమాచారాన్ని అందించగా.. వారు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. హైడ్రాలిక్ కట్టర్ సహాయంతో క్యాబిన్‌ను కట్ చేసి అందులో చిక్కుకున్న డ్రైవర్ని ప్రాణాలతో కాపాడారు. చికిత్స నిమిత్తం డ్రైవర్‌ను సర్వజన ఆసుపత్రికి తరలించారు.
LORRY ACCIDENT: రెండు లారీలు ఢీ.. క్యాబిన్లో చిక్కుకున్న డ్రైవర్ - kadapa latest updates
LORRY ACCIDENT: కడప శివారులో రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఓ లారీ డ్రైవర్ క్యాబిన్లో చిక్కుకోగా...అగ్నిమాపక సిబ్బంది అతన్ని రక్షించారు.
రెండు లారీలు ఢీ...క్యాబిన్లో చిక్కుకున్న డ్రైవర్