ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గువ్వలచెరువు ఘాట్ రోడ్​లో లోయలో పడ్డ లారీ - guvvalacheruvu ghat road

కడప జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. జిల్లాలోని గువ్వలచేరువు ఘాట్​ రోడ్​ సమీపంలో లారీ అదుపు తప్పి లోయలో పడింది. ప్రమాదంలో లారీ డ్రైవర్​కు తీవ్ర గాయలవ్వగా...స్థానికులు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ప్రమాదవశాత్తు లోయలో పడ్డ లారీ

By

Published : Aug 27, 2019, 9:19 AM IST

ప్రమాదవశాత్తు లోయలో పడ్డ లారీ

తమిళనాడు నుంచి హైదరాబాద్​కు ప్లాస్టిక్ సామాగ్రిని తరలిస్తున్న లారీ...అదుపు తప్పి కడప జిల్లా గువ్వలచెరువు సమీపంలోని లోయలో బోల్తా పడింది. కడప జిల్లాలోని రామాపురం మండల పరిధి... గువ్వలచెరువు ఘాట్ రోడ్డు మూడో మలుపు వద్దకు రాగానే లారీ అదుపు తప్పి...30 అడుగుల లోతున్న లోయలోకి దూసుకెళ్లింది. దీంతో లారీ నామరూపాల్లేకుండా పోయింది. ఘటనలో తీవ్రంగా గాయపడ్డ లారీ డ్రైవర్ ప్రకాష్​ను స్థానికులు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో లక్ష రూపాయల వరకు ఆస్తి నష్టం వాటిల్లి ఉండవచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details