డివైడర్‌ను ఢీకొన్న సిలిండర్ల లారీ... తప్పిన ప్రమాదం - Lorroy accident in kadpa district
కడప నుంచి కనేకల్ వెళ్తున్న గ్యాస్ సిలిండర్ల లారీ శివరంపేట వద్ద డివైడర్‌ను ఢీకొని అదుపు తప్పి బోల్తా పడింది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.
![డివైడర్‌ను ఢీకొన్న సిలిండర్ల లారీ... తప్పిన ప్రమాదం Lorroy hitting the divider at shivrampet kadapa district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7791226-164-7791226-1593246986252.jpg)
డివైడర్ ను ఢీకొని బోల్తా పడ్డ సిలెండర్ల లారీ...తప్పిన ప్రమాదం
కడప నుంచి కనేకల్ వెళ్తున్న గ్యాస్ సిలిండర్ల లారీ శనివారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో శివరంపేట వద్ద డివైడర్‌ను ఢీకొని అదుపు తప్పి బోల్తా పడింది. సిలిండర్లు లీక్ కాకపోవటంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం వల్ల ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు.