ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 23, 2020, 4:50 PM IST

ETV Bharat / state

ప్రొద్దుటూరులో కొవిడ్​ ఆంక్షలు కఠినం

కడప జిల్లా ప్రొద్దుటూరులో కరోనా మహమ్మారి ఉద్ధృతికి నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా కట్టడికి కలెక్టర్​ నుంచి అనుమతి తీసుకున్నామని, ఆయన ఆదేశాల మేరకు ఆంక్షలు కఠినంగా అమలు చేయబోతున్నామని కమిషనర్​ ఎన్​. రాధ తెలిపారు.

lockdown in produtur town because of increasing covid-19 cases says municipal commissioner
పురపాలక కమిషనర్​ రాధ

కడప జిల్లా ప్రొద్దుటూరులో కరోనా కేసులు పెరుగుతున్నందున ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై దృష్టి సారించిన ప్రొద్దుటూరు అధికారులు పట్టణంలో ఆంక్షలను కఠినతరం చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 24 నుంచి ఆగస్టు 12వ తేదీ వరకూ లాక్​డౌన్​ ఉంటుందని పురపాలక కమిషనర్​ రాధ వెల్లడించారు. ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు మాత్రమే దుకాణాలు అనుమతిచ్చారు. అనంతరం నిబంధనలు ఎవరైనా అతిక్రమిస్తే రూ. 10 వేల జరిమానాతో పాటుగా వాణిజ్య ధృవీకరణ పత్రం రద్దు చేస్తామని కమిషనర్​ తెలిపారు.

లాక్​డౌన్​లో మందుల దుకాణాలకు మినహాయింపు ఇచ్చారు. ప్రతి ఒక్కరూ అనవసరంగా బయట తిరగవద్దని సూచించారు. కరోనా కట్టడి పట్టణ ప్రజలు సహకరించాలని కోరారు. జ్వరం, దగ్గు, జలుబు, తలనొప్పి, వాంతులు, విరేచనాలు, వాసన గ్రహించలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వార్డు, గ్రామ వాలంటీర్​, ఆరోగ్య కార్యకర్తలకు తెలియజేయాలన్నారు. పాజిటివ్​ వచ్చినా ఎలాంటి లక్షణాలు లేకపోతే హోం ఐసోలేషన్​ ఉండేందుకు ప్రభుత్వం ఆదేశించిందన్నారు.

ABOUT THE AUTHOR

...view details