ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'సాయం చేస్తే... సాగు చేసుకుంటాం' - banglamitta tribels latest news

రెక్కాడితే గాని డొక్కాడని గిరిజనులు వారు. నిత్యం పనులు చేసుకుని వచ్చే కాస్తంతా డబ్బుతో ఇళ్లు నెట్టుకొచ్చే రైతు కూలీలు. అలాంటి వారికి గతంలో అప్పటి పాలకులు ఒక్కో కుటుంబాని ఎకరం చొప్పున భూమిని ఇచ్చారు. కానీ సాగుచేసేందుకు అనుకూలించని భూములు కావటంతో అలాగే వదిలేశారు. ఇప్పటికైన అధికారులు స్పందించి ఆ భూముల్ని చదును చేసి తమకు సాయం అందించాలని కోరుతున్నారు కడప జిల్లా బంగ్లామిట్టకి చెందిన గిరిజనులు.

ఆ భూముల్ని చదును చేయించండి సారు
ఆ భూముల్ని చదును చేయించండి సారు

By

Published : May 29, 2020, 7:35 AM IST

కడప జిల్లా రైల్వే కోడూరు మండలం బంగ్లామిట్టకి చెందిన గిరిజనులు లాక్ డౌన్ కారణంగా చేసేందుకు పనులు లేక అష్టకష్టాలు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తమను ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకుంటున్నారు. గతంలో వారికి అప్పటి పాలకులు ఇచ్చిన భూమిని సాగుచేసుకునేందుకు ప్రభుత్వం సాయం అందించాలని కోరుతున్నారు. ఆ భూముల్లో పంట పండించడం, బోర్లు వేసుకోవడం తలకు మించిన భారంగా మారిందంటూ వాపోతున్నారు. ఇప్పటికైన అధికారులు స్పందించి తమను ఆదుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఇచ్చిన ఆ భూమిని చదును చేయించి బోర్లు వేయించాలని వేడుకుంటున్నారు. తమ తలరాతలు మారాలంటే ప్రభుత్వం సాయం చేసి ఆ భూముల్లో సాగు చేసుకునేల అధికారులు చర్యలు చేపట్టాలని గోడు వెళ్లబోసుకున్నారు.

ఇదీ చూడండి:లాక్​డౌన్ ఎఫెక్ట్: ఆందోళనలో వృత్తి కళాకారుల జీవనం

ABOUT THE AUTHOR

...view details