ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ప్రొద్దుటూరులో లాక్​డౌన్​ పటిష్టంగా అమలు చేస్తున్నాం' - lock down status in kadapa district

కరోనా నేపథ్యంలో కడప జిల్లా ప్రొద్దుటూరులో ప్రజలు బయటకు రాకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని డీఎస్పీ సుధాకర్​ తెలిపారు. రెడ్​ జోన్​ ప్రాంతాల్లో ప్రజలకు పురపాలక, రెవెన్యూ అధికారుల సహాయంతో నిత్యావసరాలు అందిస్తామని అన్నారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.

'ప్రొద్దుటూరులో లాక్​డౌన్​ పటిష్టంగా అమలు చేస్తున్నాం'
'ప్రొద్దుటూరులో లాక్​డౌన్​ పటిష్టంగా అమలు చేస్తున్నాం'

By

Published : Apr 11, 2020, 1:19 PM IST

క‌డ‌ప జిల్లా ప్రొద్దుటూరులో లాక్‌డౌన్​ను ప‌టిష్టంగా అమ‌లు చేస్తున్నట్లు డీఎస్పీ సుధాకర్​ తెలిపారు. అత్యవసరైతే తప్ప మిగిలిన సమయంలో ప్రజలు రోడ్లపైకి రాకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. బయట ప్రాంతాల వారు ప్రొద్దుటూరుకు రాకుండా, ఇక్కడి వారు బయటకు వెళ్లకుండా చూస్తున్నామని చెప్పారు. రెడ్‌జోన్ ప్రాంతాల్లో ఉన్న వారికి నిత్య‌ావ‌స‌ర స‌రుకులు అవ‌స‌రమైతే క‌మాండ్ కంట్రోల్‌కు స‌మాచారం ఇస్తే పుర‌పాలక‌, రెవెన్యూ అధికారుల స‌హ‌కారంతో డోర్‌ డెలివ‌రీ చేస్తామ‌న్నారు. కరోనా వ్యాప్తి నివారణకు ప్రజలు స్వీయ నియంత్రణ పాటించి.. పోలీసులకు సహకరించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details