కడప జిల్లాలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. జమ్మలమడుగు నగర పంచాయతీలో 52 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా ఇద్దరు మృత్యువాత పడ్డారు. 23వతేదీన ఒకరోజే మండలంలో 10 కేసులు నమోదయ్యాయి. మున్సిపాలిటీ , రెవెన్యూ, పోలీస్ అధికారులు జమ్మలమడుగు నగర పంచాయతీలో లాక్ డౌన్ విధించేందుకు సిద్ధమయ్యారు. ఈరోజు నుంచి ఆగస్టు 12వ తేదీ వరకు 20 రోజులపాటు లాక్ డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించారు . ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు దుకాణాలు తెరిచి ఉంటాయని ప్రజలు ఆ సమయంలోనే బయటికి వచ్చి నిత్యావసర సరుకులు తీసుకెళ్లాలని కోరారు. ఒంటిగంట దాటిన తర్వాత రోడ్లపై కనబడితే జరిమానా విధిస్తామని హెచ్చరించారు. మాస్కులు లేకుండా బయటకు వస్తే వెయ్యి రూపాయల జరిమానా విధిస్తున్నారు. వ్యాపారులు ఒంటిగంట దాటిన తర్వాత దుకాణాలు తెరిచి ఉంచితే పదివేల రూపాయలు జరిమానా విధించి ధ్రువీకరణ పత్రం రద్దు చేస్తామని చెప్పారు. ఈ 20 రోజుల పాటు ప్రజలు సహకరిస్తే కరోనాను కట్టడి చేయవచ్చు అని పోలీసు, రెవెన్యూ , మున్సిపల్ అధికారులు తెలిపారు.
నేటి నుంచి జమ్మలమడుగులో లాక్డౌన్ - జమ్మలమడుగులో లాక్డౌన్ వార్తలు
కడప జిల్లాను కరోనా వైరస్ వణికిస్తోంది. ప్రతీ రోజు రెండు వందలకు పైగా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఐసోలేషన్ కేంద్రాలు, క్వారంటైన్ గదులు నిండిపోతున్నాయి.. జమ్మలమడుగు నగర పంచాయతీ అధికారులు ఈరోజు నుంచి ఇరవై రోజుల పాటు లాక్డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించారు.
నేటి నుంచి జమ్మలమడుగులో లాక్డౌన్