కడప నగర శివారులో ఇళ్ల స్థలాల పంపిణీకి అధికారులు పొలాలను చదును చేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలు ఏళ్ల తరబడి సాగుచేసుకుంటున్న పొలాలను ఇళ్ల స్థలాలుగా మార్చడం ఏమిటని ప్రశ్నించారు. 30 ఏళ్లుగా స్థానికులు ఈ స్థలం సాగు చేస్తున్నారు. ప్రస్తుతం తమలపాకు తోటలు పండిస్తున్నారు. వీటిని అధికారులు దున్నడానికి రావడంతో స్థానికులు అడ్డుకున్నారు. కొందరు మహిళలు ట్రాక్టర్లకు అడ్డుపడ్డారు. మహిళా పోలీసులు వారిని పక్కకు లాగేసి పంట దున్నేశారు. సరైన పరిహారం ఇవ్వకుండా ఇలా చేయడం ఏంటని మహిళలు నిలదీశారు.
'సాగు భూములను ఇళ్ల స్థలాలుగా ఎలా మారుస్తారు?' - కడపలో పేదలకు ఇళ్ల స్థలాలు
కడప నగర శివారులోని పంట పొలాలను ఇళ్ల స్థలాలుగా మూరుస్తున్న అధికారులును స్థానికులు అడ్డుకున్నారు. 30 ఏళ్లుగా ఆ భూమిని సాగుచేసుకుంటున్నామని పేదలు అంటున్నారు.
అధికారులను అడ్డుకున్న స్థానికులు