కడప జిల్లా కమలాపురం మండలంలో అదో చిన్న పంచాయతీ. సుమారు 240 ఓట్లు ఉన్నాయి. ఇక్కడ సర్పంచి పదవి ఈసారి జనరల్‌కు కేటాయించారు. రెండో దశలో ఎన్నిక జరగాల్సి ఉంది. వైకాపా మద్దతుదారు ఒకరు తనను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే.. రూ.20 లక్షలు ఇస్తానని ముందుకొచ్చారు.
ఈ మొత్తాన్ని గ్రామాభివృద్ధికి కాకుండా, పంచాయతీలోని ఒక్కో ఓటరుకు రూ.8 వేల చొప్పున చెల్లించాలన్నది ఒప్పందం. దీనికి సిద్ధపడిన గ్రామపెద్దలు మిగతా ఆశావహులను బరి నుంచి తప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.