హైదరాబాద్ నుంచి రాష్ట్రానికి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని కడప జిల్లా బ్రహ్మంగారిమఠం పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి 377 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. మద్యం తరలిస్తోన్న.. బ్రహ్మంగారిమఠం మండలం సోమిరెడ్డిపల్లెకు చెందిన లెక్కల శివారెడ్డి, కల్లూరి నాగశివలను అరెస్టు చేయగా... మరో ఇద్దరు పరారైనట్లు డీఎస్పీ విజయ్‌కుమార్ తెలిపారు.
అక్రమ మద్యం... హైదరాబాద్ టు కడప..! - liquor illegal transport to kadapa
హైదరాబాద్ నుంచి కడప జిల్లాకు అక్రమంగా మద్యం తరలిస్తోన్న వ్యక్తులను బ్రహ్మంగారిమఠం పోలీసులు అరెస్టు చేశారు. ఓ ప్రైవేట్ వాహనంలో హైదరాబాద్ నుంచి తరలిస్తున్నారన్న సమాచారంతో... పోలీసుల దాడిచేసి ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేయగా... మరో ఇద్దరు పరారయ్యారు.
అక్రమంగా మద్యం... హైదరాబాద్ టు కడప
హైదరాబాద్‌లోని పలు దుకాణాల నుంచి మద్యం తక్కువ ధరకు కొని... ప్రైవేట్ ట్రావెల్ బస్సులో మైదుకూరుకు చేర్చి, ద్విచక్ర వాహనాలపై సోమిరెడ్డిపల్లెకు తరలించి జామతోటలో నిల్వ చేశారని డీఎస్పీ వివరించారు. విక్రయానికి తరలిస్తున్న సమయంలో బ్రహ్మంగారిమఠం సీఐ కొండారెడ్డి, ఎస్సై శ్రీనివాసులు సిబ్బందితో దాడులు చేసి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పరారీలో ఉన్న నిందితులను కోసం గాలిస్తున్నామన్నారు.