ఆన్లైన్లో జరిగిన లయన్స్ క్లబ్ అంతర్జాతీయ జిల్లా 316జే ఎన్నికల్లో కడప, కర్నూలు, అనంతపురం, నెల్లూరు జిల్లాల సభ్యులు పాల్గొన్నారు. ఈ పోటీల్లో 2వ ఉప గవర్నర్గా కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన జొన్నలగడ్ల రామచంద్ర ప్రకాష్ ఎన్నికయ్యారు. ఈయన 99.9 శాతం ఓట్లతో ఎన్నికైనట్లు లయన్ జిల్లా గవర్నర్ కిషోర్ కుమార్ ప్రకటించారు. రామచంద్ర ప్రకాష్ 1976లో లయన్స్ క్లబ్‌లో సభ్యుడిగా చేరారు. ఆ తరువాత మరిన్ని పదవులు చేపట్టారు.
ఆన్లైన్లో లయన్స్ క్లబ్ 2వ ఉపగవర్నర్ ఎన్నిక - kadapa district latest news
లయన్స్ క్లబ్‌లో జరిగిన జిల్లా 316జే ఆన్‌లైన్ ఎన్నికల్లో 2వ ఉపగవర్నర్గా కడప జిల్లాకు చెందిన రామచంద్ర ప్రకాష్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆ సంస్థ సభ్యులు ఆయనను ఘనంగా సన్మానించారు.
![ఆన్లైన్లో లయన్స్ క్లబ్ 2వ ఉపగవర్నర్ ఎన్నిక lions-club-deputy-governor-elected-for-four-disricts-of-ap](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7324993-728-7324993-1590308615044.jpg)
నాలుగు జిల్లాలకు లయన్స్ క్లబ్ 2వ ఉపగవర్నర్గా ఎన్నికైన ప్రకాష్