కడప జిల్లా కమలాపురం మూడు రోడ్ల కూడలిలో ఉన్న మద్యం దుకాణం వద్ద మందుబాబులు బారులు తీరారు. జిల్లాలో కోరనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని, నిబంధనలు పాటించాలని అధికారులు, పోలీసులు చెబుతున్నప్పటికీ మద్యం ప్రియులకు అవగాహన రావడం లేదు. ఈ ఘటనపై సంబంధిత అధికారులు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. అధికారులు స్పందిచకుంటే కరోనా వైరస్ వ్యాప్తి మరింత పెరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మద్యం కోసం మందుబాబుల బారులు - news updates in kamalapuram
కడప జిల్లాలో ప్రభుత్వ మద్యం దుకాణాల వద్ద కరోనా నిబంధనలు గాలికొదిలేశారు. కేసులు అంతకంతకూ పెరుగుతున్నా... భౌతికదూరం, మాస్క్ వంటి వాటిని పట్టించుకోవట్లేదు. కమలాపురం మూడు రోడ్ల కూడలి వద్ద మద్యం కోసం మందుబాబులు ఎగబడ్డారు.
![మద్యం కోసం మందుబాబుల బారులు lines-in-front-of-wine-shops-in-kamalapuram](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11616436-93-11616436-1619961578037.jpg)
కమలాపురంలో మద్యం కోసం మందుబాబుల బారులు