పట్టణాల్లో తాళాలు వేసి ఉన్న ఇళ్లనే లక్ష్యంగా దొంగలు చోరీలకు పాల్పడుతున్నారని కడప జిల్లా రాజంపేటలో డీఎస్పీ నారాయణస్వామి రెడ్డి తెలిపారు. దొంగతనాలు అరికట్టేందుకు ఎల్‌హెచ్‌ఎం విధానాన్ని అమలు చేయనున్నట్లు వెల్లడించారు. రాజంపేట ప్రజలందరూ ఎల్‌హెచ్‌ఎం యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. ఎప్పుడైనా ఊర్లు వెళ్లే ముందు.. ఎప్పుడు వెళ్తున్నారు, ఎన్ని రోజులు ఉంటారనే విషయాలు యాప్‌లో నమోదు చేస్తే తాము అధునాత కెమెరాలు ఇంట్లో అమర్చుతామని వివరించారు. దొంగ ఇంట్లోకి ప్రవేశిస్తే కంట్రోల్ రూమ్‌కు సమాచారం వస్తుందని తెలిపారు. వెంటనే పోలీస్ సిబ్బంది అక్కడికి వెళ్లి దొంగలను పట్టుకునే అవకాశం ఉందని తెలిపారు. ప్రజలు ఈ విధానాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఎల్హెచ్ఎంతో చోరీలకు అడ్డుకట్ట - rajamapet lhm
ఎల్‌హెచ్‌ఎం విధానం అమలు ద్వారా చోరీలకు అడ్డుకట్ట వేయవచ్చని పోలీసులు తెలిపారు. ప్రజలు ఎల్‌హెచ్‌ఎం యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. ముందుగానే యాప్‌లో వివరాలు నమోదు చేయడం ద్వారా అధునాతన కెమెరాలు ఇంట్లో అమర్చుతామని తెలిపారు. ఈ మేరకు కడప జిల్లా రాజంపేటలో డీఎస్పీ నారాయణస్వామి రెడ్డి యాప్ వివరాలు వెల్లడించారు.
రాజంపేటలో ఎల్‌హెచ్‌ఎం విధానం