ప్లాస్టిక్ వినియోగాన్ని నివారించి దేశాన్ని కాపాడాలని విద్యార్థినులు ఏకాభిప్రాయానికి వచ్చారు. మట్టిలో కలవని ప్లాస్టిక్ కవర్ల వాడకం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కడప జిల్లా జమ్మలమడుగులోని శ్రీ వివేకానంద జూనియర్ కళాశాలలో ఈనాడు, ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జరిగింది. గాంధీ జయంతిని పురస్కరించుకుని వీలైనంత వరకు ప్లాస్టిక్‌ను వాడకుండా నివారించేందకు అందరూ కృషి చేయాలని కోరారు. ప్లాస్టిక్ మనుషులపైనే కాకుండా పశువులు, మొక్కలపై తీవ్ర ప్రభావం చూపుతుందని అన్నారు.
ప్లాస్టిక్ నివారిద్దాం... దేశాన్ని కాపాడుదాం - jammalamadugu
కడప జిల్లా జమ్మలమడుగులోని ఓ ప్రైవేటు కళాశాలలో ఈనాడు, ఈటీవీ-భారత్ ఆధ్యర్యంలో ప్లాస్టిక్‌పై అవగాహన సదస్సు జరిగింది.
ప్లాస్టిక్ నివారిద్దాం.... దేశాన్ని కాపాడుదాం