కడప జిల్లా రైల్వేకోడూరులోని మండల పరిషత్ కార్యాలయాన్ని కుష్టు బాధితులు ముట్టడించారు. ప్రభుత్వం తమ పెన్షన్లను తీసి వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీడీవో కార్యాలయంలోనికి అధికారులను ఎవరినీ ప్రవేశించకుండా...పెన్షన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 1977 నుంచి ప్రభుత్వం పెన్షన్లు ఇస్తూ ఉంటే ఇప్పుడున్న వైకాపా ప్రభుత్వం... వాటిని తొలగించడం దారుణమన్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి ఇంటిని ముట్టడించేందుకు వెనకాడబోమని చెప్పారు.
పింఛన్ల కోసం కుష్టు బాధితుల నిరసన - రైల్వేకోడూరులో కుష్టు వ్యాధిగ్రస్తుల నిరసన
కడప జిల్లాలోని రైల్వేకోడూరు మండల పరిషత్ కార్యాలయాన్ని కుష్టు బాధితులు ముట్టడించారు. ప్రభుత్వం తమకు పెన్షన్లను తొలగించడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
![పింఛన్ల కోసం కుష్టు బాధితుల నిరసన leprosy people protest at kadapa district railway kodur MPDO office](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5412803-811-5412803-1576666010892.jpg)
రైల్వేకోడూరులో కుష్టు వ్యాధిగ్రస్తుల నిరసన