కడప జిల్లా రాజంపేటలో ఎన్ఆర్సీ, సీఏఏ చట్టాలను వ్యతిరేకిస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో ప్రజా గర్జన కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్ఆర్సీ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరిస్తూ తీర్మానం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఓబులేసు డిమాండ్ చేశారు. ముస్లింలకు అండగా ఉంటామని చెబుతున్న నేతలు చట్టం చేయడంలో ఎందుకు వెనుకడుగు వేస్తున్నారని ప్రశ్నించారు. కేంద్రం ప్రవేశపెట్టిన చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేయమంటూ సీఎం జగన్ తెలపాలని మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్రెడ్డి డిమాండ్ చేశారు.
ఎన్ఆర్సీ, సీఏఏకు వ్యతిరేకంగా రాజంపేటలో వామపక్షాల ప్రజాగర్జన - rajampeta latest news
రాజంపేటలో కేంద్రం ప్రవేశపెట్టిన ఎన్ఆర్సీ, సీఏఏ చట్టాలను వ్యతిరేకిస్తూ వామపక్షాలు ప్రజాగర్జన కార్యక్రమం నిర్వహించారు.

రాజంపేటలో వామపక్షాల ప్రజాగర్జన